Wednesday, 29 July 2026 12:00:49 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా....! ఆదిలాబాద్ కు యూనివర్సిటీ మంజూరు

సీఎం రేవంత్ రెడ్డి

Date : 04 December 2025 07:27 PM Views : 274

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించి దాదాపు 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా పాలన వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా సభలో సభలో సీఎం మాట్లాడుతూ సీఎంఆదిలాబాద్ జిల్లాను మొదటి నుంచి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ముందుగా తాను సీఎం పదవి చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని సంతకం పెట్టినట్లు చెప్పారు. చదువు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇక్కడి నాయకులే చర్చించుకొని తమకు తెలిపినట్లైతే అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అన్నారు. కొమరం పుట్టిన గడ్డ కాబట్టి తనకు ఎంతో ఇష్టమని ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడే ఉందని గత పది సంవత్సరాల పాలనలో పెద్దమనిషి ఏం అభివృద్ధి చేశాడని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు నాయకులు మూడు ప్రాంతాల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అంటున్నారని పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో, వెడమ బొజ్జు, ఖానాపూర్ లో ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. అందుకోసమే ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకొని చెప్తే త్వరగా జరుగుతున్న జరుగుతాయని తెలిపారు. నాకు మాత్రం ఇంద్రవెల్లి లో యూనివర్సిటీకి పెడితే బాగుంటుంది అని అన్నారు. నా మనసుకైతే అలా అనిపిస్తుం దని తెలిపారు. అక్కడ నాగోబా జాతర ఉంటుందని అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ అని బాగుంటుందన్నారు. పోరాట వీరుడు కొమరం భీమ్ పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని సీఎం అన్నారు. అనుమతి ఇచ్చేది మాత్రం నేనేనని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ పంచాయతీలో నన్ను లాగ వద్దని అన్నారు. తుమ్మిడి హేట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించి రైతాంగాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. త్వరలోనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ రెడ్డి ఆదిలాబాద్ కు వస్తారని అన్నారు. అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక 61 వేలమందికి ఎల్బీ స్టేడియంలో ఉద్యోగనియామక పత్రాలు అందజేశానని తెలిపారు. గత పాలకులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. వారు 10 సంవత్సరాలలో సంపాదించిన డబ్బు కోసం కుటుంబీకులంతా గొడవ పడుతున్నారని చెప్పారు. ఇక వారి ఖేల్ కతం దుకాణం బంద్ అని స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు జేబులో వేసుకొని మూడు సంవత్సరాలకే కూలేశ్వరం ప్రాజెక్టు అయిన మాట వాస్తవం కాదా అన్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎంపీ గేడంనగేష్, ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్ ఎమ్మెల్యేలు వెడమ బొజ్జు, పాయల శంకర్ ఎమ్మెల్సీ దండే విటల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: