Wednesday, 29 July 2026 08:28:45 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రాంప్ ద్వారా మహిళలకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణ మద్దతు...

అదనపు కలెక్టర్ (రెవెన్యూ)పి.చంద్రయ్య

Date : 25 February 2026 11:08 PM Views : 264

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాంప్ మహిళా త్వరణ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎం. ఎస్. ఎం. ఈ. లకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణం మద్దతును అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య లతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళ వ్యవస్థాపకులకు ఐ టి ఈ - సి విభాగం, వీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించినఅవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు, భారత ఎంఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ మద్దతుతో రాంప్ ద్వారా మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎంఎస్ఎమ్ఈ నిర్మాణాత్మక వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. 2 సంవత్సరాల ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మహిళా వ్యవస్థాపకులకు వ్యాపార వృద్ధిని వేగవంతం చేసేందుకు, వారి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం అందిస్తుందని తెలిపారు. వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, తయారీ, హస్త కళలు, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలోని సంస్థలు, వ్యాపార నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి అభివృద్ధి, వైవిధ్యేకరణ, బ్రాండింగ్, మార్కెట్ ఆక్సెస్, క్రెడిట్ లింకేజ్ లకు నిపుణుల మార్గదర్శకత్వంలో మద్దతు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆసక్తి గల వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం నాన్ ఫామ్ సారయ్య, వి హబ్ సంచాలకులు జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా, డా. సల్మాన్, అబిద్, శ్రీకర్,ఈ డి సి ప్రశాంత్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :