ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దివ్యాంగుల నూతన ధ్రువపత్రాలు, పునరుద్ధరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య తెలిపారు తెలంగాణ ఈ నివాస్ న్యూస్. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, ఆర్. ఎం. ఓ. డా. సుధీర్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 1, 3, 4, 6, 7, 10, 11, 12, 13, 14 తేదీలలో లోకో మోటార్,ఆర్దో, 17, 18 తేదీలలో వినికిడి లోపం సంబంధించి ప్రతిరోజు 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో మీ- సేవ కేంద్రాలలో అక్టోబర్ 20వ తేదీ వరకు నూతనంగా నమోదు చేసుకున్న లోకో మోటార్,ఆర్దో, వినికిడి లోపం అభ్యర్థులు సంబంధిత పత్రాలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం బదిలీలలో శిబిరాలను నిర్వహించాలని, క్యాంపు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డా. రాజేష్, డి.పి.ఎం. అన్నాజీ, ఎ. పి. ఎం. రాజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News