Monday, 14 September 2026 07:18:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కూచ్ రాజ్ పల్లికి మహర్దశ..

కూచ్ రాజ్ పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Date : 12 January 2026 01:41 PM Views : 370

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని కూచ్ రాజ్ పల్లికి మహర్దశ పట్టనుంది. కూచ్ రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 4.5 కోట్లతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహం, రూ. 60 లక్షలతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో నిర్మించనున్న కూచిరాజుపల్లి బస్టాండ్, రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈద్గా నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలతో కూచ్ రాజ్ పల్లి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకు స్థాపన చేయడంతో నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిపాలనాధికారి కోయ శ్రీహర్ష, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు గంగదరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :