ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ : కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎంపీడీవో ఆవరణలో ఏర్పాటు చేయనున్న ముగ్గుల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. 14 న (నేడు) ఎంపిడిఓ ఆఫీసు ఆవరణం లో ఉదయం 9 గంటల నుండి పోటీలను నిర్వహించనున్నామన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు ఇవ్వటం జరుగుతుందని, మొదటి బహుమతి 6,116/-, రెండవ బహుమతి 4,116/-, మూడవ బహుమతి 3,116/-, పోటీలో పాల్గొన్న ప్రతీ మహిళకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనే మహిళలు ముగ్గులు వేయుటకు కావలసిన సామాగ్రి వెంట తీసుకుని రావాలన్నారు. మరిపెడ మండల మహిళామణులు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట మైనార్టీ నాయకులు అజీజ్, జిల్లా నాయకులు గుండాగాని వేణు, శ్రీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల యూత్ నాయకులు జాటోత్ సురేష్ నాయక్, బోర గంగయ్య, రవికాంత్, లెజెండ్ పరశురాములు, కృష్ణ, దస్రు, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News