ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లేబర్ కోడ్స్ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఉత్కూర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, నోటిఫికేషన్ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చే విధంగా లేబర్ కోడ్స్ నిన్నటి రోజున అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిం దన్నారు . ఇది అత్యంత దుర్మార్గం అన్నారు. కార్మికుల మెడలకు ఉరితాళ్లుగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి, పని గంటలు పెంచుతు, ఉద్యోగ భద్రత,సామాజిక భద్రత ఇతర కార్మికులకు చట్టబద్ధత సౌకర్యాలల్లో మార్పులు చేసిందన్నారు. ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేర్లతో యజమానులకు అనుకూలంగా కార్మికులతో పని చేయించుకుని మళ్లీ కార్మికులను తొలగించడానికి ఈ కోడ్ అమలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలను తొలగిస్తూ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిన కార్మికులతో శ్రమ దోపిడీ చేయడం,సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా, కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు కార్మిక వర్గం కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం అవ్వాలని సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిస్తుం దన్నారు . అనంతరం మాజీ సీఐటీయూ నాయకులు కనికరపు అశోక్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గానికి, రైతంగానికి పేద ప్రజలకు నష్టం చేకూర్చడానికి ఈ లేబర్ కోడ్స్ తెచ్చింది. ఇవి అమలు జరిగితే కార్మికులు వారి హక్కులు కోల్పోతారు. కావున కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, కూలీలు, రైతాంగం ప్రజలు ఐక్యంగా ముందుకు వచ్చి పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య హామలి సంఘం అధ్యక్షులు, రమేష్, రాజన్న, మల్లయ్య, సత్తన్న శ్రీను, సతయ్య రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News