Tuesday, 28 July 2026 10:28:01 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

విజ్ డమ్ ప్రీ స్కూల్ లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు...

Date : 10 January 2026 01:45 PM Views : 383

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోనివిజ్ డమ్ ప్రీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా దాని కనుగుణంగా చక్కని వేషధారణతో, అలంకరించుకొని ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానోఅలరించాయి. సంస్కృతిసంప్రదాయాలకు అనుగుణంగా చిన్నారులు ధరించిన దుస్తులు, వేసిన ముగ్గులు చూపరులను ఎంతగానోఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది ఆధ్యాత్మికత, కుటుంబం, సంస్కృతిని కలిపే గొప్ప పండుగని, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గులు, భోగి మంటలు, డూడూ బసవన్నల సందడి, వాటి సంప్రదాయాలతో ఈ పండుగ కళకళలాడుతుందని, ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని, ఆత్మీయతను పెంపొందిస్తుందని వారు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫహీంసుల్తానా మాట్లాడుతూపంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు ఇది ఆనందాన్ని, సంపాదనను తెస్తుందని అందుకే అందరూ దీనిని పంటల పండుగ అని అంటారని పేర్కొన్నారు. చెడును విడిచిపెట్టి, మంచిని ఆహ్వానించడం, కొత్త శక్తితో ఉత్సాహంగా జీవించడం, దానధర్మాలు చేయడం, సంప్రదాయాలను పాటించడం ఈ పండుగ ముఖ్యాంశమని అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ఇన్చార్జి హారికలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరితా రాణి, దివ్య, మాధవి, రాధిక, స్వాతి, అఖిల, సౌజన్య, రవళి, సుజాత, రజనీ కుమారి, కళ్యాణి, శ్రీలత, భద్రయ్య లతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :