ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాతాండూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుఎండి. ఈసా తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ శనివారం ఈసాని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈసా నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తల్లి మృతి కుటుంబానికి తీరని లోటని కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చి, తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం తాండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గెలుపొందిన సర్పంచులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూగ్రామ పాలనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమ న్నారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ తెలిపారు. సర్పంచులు అంకితభావంతో పని చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయిఅధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News