ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న నిషేధిత చైనా మాంజా వాడకం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. సంక్రాంతి పండగ నేపథ్యంలో వరస మాంజ ప్రమాదాలు వాహన దారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఉదయం ఉప్పల్ లో చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయం అయింది. దీంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారంనగరంలో నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాపాయాన్ని సృష్టించింది. సంక్రాంతి పండుగ వేళగాలిపటాలు ఎగరేసేందుకు వాడే ఈ ప్రమాదకరమైన దారం.. విధి నిర్వహణకు వెళ్తున్న ఒక పోలీస్ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుచైనా మాంజా కారణంగా గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ నాగరాజు ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఉప్పల్‌లోని తన నివాసం నుండి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరా రు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్దకు చేరుకోగానే గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఆయన గొంతుకు అకస్మాత్తుగా చుట్టుకుంది. వాహనం వేగంగా ఉండటంతో మాంజా గొంతులోకి బలంగా చొచ్చుకెళ్లింది. దీంతో ఆయన గొంతుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి పోలీసులు ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యు లు చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Admin
E Nivas News