ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తెరాస పార్టీ తలుపులు ఆహ్వానం పలకడానికి ఎల్లప్పుడూ తెరచి ఉంటాయని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. గురువారం జగిత్యాల పట్టణంలో జీవన్ రెడ్డి నివాసానికి పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి వచ్చి కెసిఆర్ ఆదేశాల మేరకే మిమ్మల్ని కలవడానికి వచ్చానని మీరు మా పార్టీలో చేరాలని కోరగా, అవును వస్తా కెసిఆర్ ను కలిసినాక తన పూర్తి నిర్ణయం చెబుతానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయ మేధావి రాజకీయ దురంధరుడు అయిన జీవన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత అహంకారం ఉందో తేటతెల్లమైందన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా గత 40 సంవత్సరాలుగా పార్టీని పట్టుకొని సేవలందించిన ఒక సీనియర్ నాయకుడిని ఇలా అవమానపరిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అని అన్నారు. రెండున్నర సంవత్సరాల పాలన గలుస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజల దరిచే రలేదు అన్నాడు. అయినా మునిగిపోయింది ఏం లేదని జీవన్ రెడ్డి ఇలాంటి నాయకుడు మా పార్టీకి కావాలని ఆయన గౌరవానికి తగ్గట్టుగా పార్టీ చూడడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడిన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం లేదని కేటీఆర్ విరుచుక పడ్డారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాటలు విడిచి పెడుతున్నాడు అతను ఒక సీఎం ఏనా అని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డట్టేనన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని తన జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా సుఖసంక్షేమలతో ఉండేలా పనిచేయడం జరిగిందన్నారు. ఏ ఒక్కనాడు కూడా నేను స్వార్థం కోసం పనిచేసిన దాఖలాలు లేవన్నారు. అయినా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తనను చిన్న చూపు చూడడంతోనే విసిగి వేసారి తన నిర్ణయాన్ని తన నియోజకవర్గ నాయకుల ప్రజల కోరిక మేరకే మార్చుకున్నట్టు తెలిపారు. కెసిఆర్ తో పని చేయడం నాకు చాలాసంతోషంగా ఉంటుందన్నారు. కెసిఆర్ కున్న అనుభవం నాకేంటో తెలుసన్నారు. కెసిఆర్ రాజకీయంలో కాకల దీరుణ నాయకుడని వర్ణించారు. జగిత్యాల ప్రాంత రైతాంగం మళ్లీ కేసిఆర్ ప్రభుత్వమే వస్తుందని నాతో పదేపదే అంటున్నట్లుగా చెప్పారు. ముందుగా జీవన్ రెడ్డి తమ నాయకులతో కలిసి కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల్,నిజాంబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ మయంగా మారిన జగిత్యాల.. జీవన్ రెడ్డిని తెరాస పార్టీలోకి ఆహ్వానించడానికి కేటీఆర్ వస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాల జిల్లా కేంద్రమంతా టిఆర్ఎస్ ఫ్లెక్సీలతో గులాబీ మయంగా మారింది. రేపు ఫ్లెక్సీలో చూసిన జీవన్ రెడ్డి ఫోటోలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న ఫ్లెక్సీలను కార్యకర్తలు చేయించారు
Admin
E Nivas News