Sunday, 13 September 2026 12:48:48 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత...

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Date : 13 January 2026 11:09 PM Views : 171

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా “అరైవ్ అలైవ్ – 2026” పేరిట రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి–మంచిర్యాల జోన్‌లో 10 రోజుల పాటు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి–మంచిర్యాల జోన్‌లో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొని ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ లేదా ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామస్థులు, యువత, వాహనదారులు అందరూ కలిసికట్టుగా రోడ్డు భద్రతకు బాధ్యత వహిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. సురక్షితంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా తగ్గించవచ్చో ప్రజలకు వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలినిమిషాల్లో అందించే ప్రాథమిక చికిత్స అత్యంత కీలకమని, సరైన సమయంలో సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి వినియోగం, అతివేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపరాదనే అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి వాహనదారుడి సామాజిక బాధ్యత అని మరోసారి గుర్తు చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగాఅదే ప్రాంతానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితులు లేదా వారి కుటుంబ సభ్యుల నిజ జీవిత అనుభవాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. చిన్న నిర్లక్ష్యం ఎలా కుటుంబాలను జీవితాంతం బాధలోకి నెట్టేస్తుందో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకువచ్చి, ప్రమాదాలను తగ్గించి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: