Tuesday, 28 July 2026 09:36:22 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై ఆవేదన

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 23 December 2025 08:40 PM Views : 280

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.భక్తితో మెట్ల మార్గం ద్వారా కొండలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలచివేశాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏడుకొండల మెట్ల మార్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.మెట్ల దారి పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు, కన్‌స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోయి ఉండటం వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు. టాయిలెట్ ఇన్నోవేషన్ల పేరుతో ఏర్పాటు చేసిన కమోడ్లు, మెట్ల మధ్యలో పెట్టిన స్టీల్ ట్రేల కారణంగా భక్తులు సరిగా నడవలేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని, కాళ్లకు గాయాలయ్యే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండాకనీసం ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాలు కూడా మెట్ల మార్గంలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మెట్టు వద్ద భక్తులు బస్సులు, కార్ల మధ్య నుంచి ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సి వస్తోందని, ఇది భక్తుల భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి, తిరుమల మెట్ల మార్గంలో తక్షణమే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.భక్తుల భద్రత, శుభ్రత, గౌరవంతో దర్శనం జరగడం అత్యంత ప్రాధాన్యమని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగడం అనర్హమని ఆయన స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: