ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వయోవృద్దుల సంరక్షణ భాద్యత వారసులదేనని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. ప్రపంచ వయోవృద్దుల దినోత్సవం సందర్బంగా గురువారం మంథని కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమ బాధ్యత వారి వారసులదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం క్రింద రెవెన్యూ డివిజన్ అధికారి కేసుల విచారణ జరిపి ఉత్తర్వులను జారీ చేస్తారన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘన జరిగిన పక్షంలో కోర్టులు గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష, 5వేల వరకు జరిమాన విధించవచ్చని పేర్కొన్నారు. అనంతరం సీనియర్ న్యాయ వాదులు కె రఘోతం రెడ్ఢి, సువర్ణ చంద్రశేఖర్ లు చట్టం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికుల పెన్షనర్ అసోషియేషన్ సభ్యులు, న్యాయ వాదులు కటకం శ్రీనివాస్, సదన్ కుమార్, శశిభూషణ్ కాచెలు పాల్గొన్నారు.
Admin
E Nivas News