ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : రాజన్న ఆలయంలో నేటి నుంచి దర్శనాలు నిలిపివేసి, భీమేశ్వరాలయంలో ప్రారంభించడంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు అని ప్రశ్నించారు? భక్తులు, ప్రజల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఆలయం మూసి వేస్తే పంచలు కట్టుకొని తలుపులు తెరుస్తామని ఫైరింగ్ చేస్తారో లాఠీచార్జి చేస్తారో చూద్దామన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి మేం భక్తులకు అండగా ఉంటామని బండి స్పష్టం చేశారు.
Admin
E Nivas News