ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంథని మండలం గుంజపడుగు ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఓటర్ గుర్తింపు వివరాలు, వార్డ్ సమాచారం తెలుసుకున్నారు. ఓటు ఎక్కడి పోలింగ్ బూత్ లో వినియోగించుకోవాలో తెలపారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడున్న పోలీసు సిబ్బందిని సహాయం చేస్తారని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు, ప్రతి ఓటరు స్వేచ్ఛగా, భయభ్రాంతులు లేకుండా ఓటు వేయడానికి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
Admin
E Nivas News