ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎగిరేది బి ఆర్ ఎస్ జెండా నే అని ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాబజార్ హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు ఫడ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కేంద్రే బాలాజీ ఈరోజు బిజెపి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మండలంలోని బలాన్ పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులుతులసిరాం ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు మరియు పలువురుస్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చాక పార్టీ అభివృద్ధికి పని చేసిన ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందన్నారు . నాయకులకు కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లుతుంది అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అందుకే మళ్ళీ ప్రజలంతా కేసీఆర్ వైపు ముగ్గు చూపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతీ పల్లెల్లో కేసీఆర్ రావాలని కోరుతున్నారని అన్నారు.కార్యక్రమంలోపలువురునాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News