ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మాజీమంత్రిదంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం అందించారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆ కనకదుర్గమ్మ దివ్య దీవెనలు తెలంగాణప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.
Admin
E Nivas News