Tuesday, 28 July 2026 11:02:49 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం...

రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..

Date : 27 March 2026 08:35 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శ్రీరామనవమిని భద్రాచలంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం వేద పండితులు మంత్రం చారణల మధ్య కన్నుల పండవగ నిర్వహించారు.మిథిలా స్టేడియంలో శిల్ప కళాశోభిత కళ్యాణ వేదికపై సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి ప్రభుత్వం తరఫున సీఎం రివర్ రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాదికి తరలివచ్చారు . దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో ప్రతి ఏటా శ్రీరామనవమినగా జగద్రక్షకుడి కళ్యాణం అంగరాల అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్ట హాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలాభక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలి వస్తున్నారు.సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి జన్మ సార్ధకం చేసుకున్నారు. నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ పండితులు ఎదుర్కోలు ఉత్సవంనిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో ఎదుర్కొ లు అత్యంత కీలకమైన ఘట్టం. పెళ్లికి ముందు సీతారాములను ఎదురెదురుగా ఉంచి, ఇరు పక్షాల వారు పసుపు, కుంకుమలు, తాంబూ లాలు మార్చుకుంటూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణాన్ని సీతమ్మ పుట్టినిల్లయిన మిథిలా నగరంగాపక్కనున్న వైకుంఠ క్షేత్రం రామయ్య వెలసిన ప్రాంతంగా భావిస్తారు. అలాగే అర్చకులు భగవంతుని వంశ క్రమాన్ని, గోత్ర నామాలను చదువుతూ పెళ్లికి ముందు వధూవరుల పక్షాన వాదోపవాదాలు చేసుకునే ఈ ఎదుర్కోలు ఘట్టం అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇదిలావుంటే, శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం కు వచ్చిన సీఎం సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11గంటలకు రామాలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.351కోట్లతో మొదటి విడత పనులకు శంకుస్థాపన గావించారు. ఇప్పటికే రామాలయ అభివృద్ధికి రూ.586కోట్ల తో బృహత్తర ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశ పనులను రూ.351కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. శనివారం జరిగే శ్రీరామ పట్టేభిషేకానికి అన్ని రకాల ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :