Sunday, 13 September 2026 12:50:11 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 31 March 2026 10:37 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్ కులమునకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం ఎలక్ట్రికల్ లో ఈ.వి. 2 వీలర్ ను 90 శాతం రాయితీ, 10 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 1 లక్ష రూపాయలతో 180 యూనిట్లు, ఈ. వి. త్రిచక్ర వాహనం (సరుకు రవాణా,ప్రయాణికుల రవాణా) ను 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయలతో 89 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పథకాలలో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగం ను 100 శాతం కార్పొరేషన్ రాయితీ కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు 19 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. పశు సంవర్ధక పథకాలలో 70 శాతం కార్పొరేషన్ రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 2 లక్షల 40 వేల రూపాయలతో 96 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, టామ్ కామ్, ప్రధానమంత్రి అజయ్ పథకాల క్రింద జాతీయస్థాయి శిక్షణ సంస్థల ద్వారా వేతన ఉపాధి కొరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు, కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత), ఆదాయ ధ్రువీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలకు లోబడి), వ్యవసాయేతర పథకాలకు అభ్యర్థుల వయసు 21-50 సం.లు, వ్యవసాయ పథకాలకు 21-60 సం.లు ఉండాలని తెలిపారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు), షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలు,గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టాదారు పాసు పుస్తకం (సోలార్ పంపు సెట్ కోసం కనీసం 2 ఎకరాల భూమి అవసరం), బోరు బావి, నీటి లభ్యతను నిర్ధారిస్తూ గ్రామ కార్యదర్శి నుండి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, సదరం సర్టిఫికెట్ (దివ్యాంగుల కొరకు), పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలని తెలిపారు. పాడి పశువుల పథకం కొరకు పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల సాగునీటి సౌకర్యం ఉన్న సొంత/కౌలు భూమి కలిగిన షెడ్యూల్డ్ కులములలబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ లోగా ఓబి ఎంఎంఎస్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని సరైన ధ్రువపత్రాలు జత చేసి సంబంధిత మండలం/మున్సిపాలిటీ కార్యాలయాలలో సమర్పించాలని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :