ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బడి ఏడు పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చేరడం బాధాకరమని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతున్న 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా విజయోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడీడు పిల్లలు మూడింట రెండో వంతు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడగలిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలల మునగడ సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం పది మరియు ఇంటర్ లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మరమట్, డీఈవో లలిత, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, అలీ బిన్ అహమ్మద్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News