Wednesday, 29 July 2026 12:01:52 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

డ్రైవర్లు వాహన నియమ నిబంధనలు పాటించాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 03 February 2026 11:09 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి నూతన విధానం."అరైవ్ అలైవ్" లో భాగంగా గత నెల 21న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జరిగిన ఉచిత కంటి పరీక్షల్లో భాగంగా పరీక్షలలో కంటి సమస్యలు ఉన్న వాహన డ్రైవర్లకు మంగళవారం పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 84 వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటిఅద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు వాహన నియమనిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. మంచి కంటి చూపు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని, జిల్లా పోలీసు శాఖ తరపున మరియు పట్టణంలోని ప్రైవేటు కార్తీక్ ఆప్టికల్స్ యజమాని పొలసాని హనుమాన్లు యాదవ్ సహకారంతో ఉచితంగా కంటి అద్దాలను డ్రైవర్లకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకొని, ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రాణానష్టాన్ని తగ్గించాలనిసూచించారు. వాహనాలు, ఆటోలు, టాక్సీలు రాంగ్ సైడ్ ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాంగ్ సైడ్ ప్రయాణాన్ని మానుకోవాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై సైన్ బోర్డులు, వేగ నియంత్రణ బోర్డులు ఉన్న సందర్భంలో వాహన వేగాన్ని తగ్గించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. పట్టణంలోని ఆటోలు అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్న సందర్భంలో వారి పై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :