ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాదిగ హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెలువరించే అన్నీ ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేయాలనీ, రాజ్యాంగం, హక్కుల రక్షణకై అందరం ఐక్యత కావాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్ కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని కమ్యూనిటీ భవనంలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూఈ నెల 9న వరంగల్ లో జరిగే ఎంఆర్పీఎస్ సభను జయప్రదం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ దళితులకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిప్పకుర్తి మల్లేష్, సర్పంచ్లు లింగంపల్లి వెంకటేష్, ములకల్ల రాందాస్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, సృజన్, సీనియర్ నాయకులు శెనిగరం లింగన్న, చాతరాజు రాజన్న, అడ్లూరి దేవేందర్, తోటపల్లి మహేందర్, లింగంపల్లి సుధాకర్, ఎల్లయ్య, నిఖిల్, కల్లపల్లి వెంకటేష్, దర్శనాల రవితేజ, ఆరెల్లి ప్రవీణ్, నవీన్, కలమడుగు శ్రీకాంత్, మంద శంకర్, అడ్లూరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News