ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని నందిరెడ్డి గార్డెన్ లో రాష్ట్ర మంత్రి వర్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అధ్యక్షతన కాంగ్రెస్ పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ ఫేస్-2 కార్యాచరణ ప్రణాళిక, పట్టణ,డివిజన్, మండల కమిటీల నియమాకాలు, బీఎల్ఏ -2 కార్యకలాపాల పర్యవేక్షణ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణం, జిల్లా, నియోజకవర్గాలలో ప్రస్తుత స్థానిక రాజకీయ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా సమీక్ష లో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు , గడ్డం వినోద్ , ఎంపీ గడ్డం వంశీ కృష్ణ , పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి రెహ్మత్ , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాజీ డిడి డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి- నర్సయ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ , మంచిర్యాల జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి , జిల్లా ఓ బీసీ అధ్యక్షులు వొడ్డె రాజమౌళి , జిల్లా మైనారిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్ , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కార్పొరేటర్ పెంట రజిత , తదితరులు పాల్గొన్నారు..
Admin
E Nivas News