Friday, 11 September 2026 08:13:19 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పోలీసు ఉద్యోగుల పరీక్షల పై ప్రత్యేక నిఘా పెడతాం..

సీఎం రేవంత్ రెడ్డి

Date : 06 August 2026 09:00 AM Views : 107

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోం శాఖ అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యం లో డీజీపీ సీవీ ఆనం ద్, ఇతర పోలీస్‌ ఉన్నతాధి కారులతో సీఎం అత్య వసర సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం 7,437 పోస్టుల కోసం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా నిర్వ హించాలని అధికారు లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ప్రింటింగ్, ట్రాన్స్​పోర్ట్​తో పాటు అన్ని దశల్లో చాలా అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. నియమ నిబంధన లను అనుసరించి లోపాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల సెక్యూ రిటీపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించా లని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సూచిం చారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్​ మీడియాలో ఎలాంటి దుష్ప్ర చారం జరగకుండా కట్టడి చేయాలనిసూచించారు. పోలీస్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమా యకపు నిరుద్యోగు లను మోసం చేసే దళారులు, ఫేక్ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లపై సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్​మెంట్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కోచింగ్‌ సెంటర్లపై నిరంతరం ప్రత్యేక నిఘా పెట్టాలని, అన్నారు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్, పోలీస్‌ నియామక మండలి బోర్డు ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు, హైదరాబాద్‌ పోలీస్​ కమిషనర్‌ వి.సి. సజ్జనర్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :