ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని సాంబశివాలయంలో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ కమిటీ కార్యదర్శి వొజ్జల శ్రీనివాస్ తెలిపారు. గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో గీతా సప్తాహంను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గీతా పారాయణం ఏడు రోజులు జరుగుతుందని, భక్తులు ఈ గీత పారాయణంలో పాల్గొని.భగవద్గీత అధ్యయనం ద్వారా మానవ జన్మను సార్ధకం చేసుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మానవుని జీవితంలో వచ్చే అన్ని రకాల కష్టాలను గీత అధ్యయనం ద్వారా సులభంగా అధిగమించవచ్చని వివరించారు. కుల,మతాలకు అతీతంగా అందరూ ఈ వారం రోజులు గీత అధ్యయనం, శ్రవణం ద్వారా ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 1 సోమవారంతో గీత యజ్ఞం కార్యక్రమం ముగుస్తుందని, సోమవారం జరిగే గీతా యజ్ఞంలో భక్తులు పాల్గొని భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మాదంశెట్టి రాంచందర్, నరేందుల భీమన్న, జిల్ల సత్తయ్య, గుండ లక్ష్మీ నారాయణ, బొద్దుకూరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News