Tuesday, 15 September 2026 05:23:41 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి ఏర్పాటు

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 12 December 2025 11:44 PM Views : 269

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వైద్య సేవలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా చేపట్టిన ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, గుత్తేదారుల సమన్వయంతో పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు, అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను సందర్శించి పనులు త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా గుత్తేదారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మండల కేంద్రంలో చేపట్టిన అమృత్ 2.0 నిర్మాణ పనులను పరిశీలించి ప్రతి నివాసానికి నిరంతరాయంగా త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: