ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాఉట్నూర్‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం నిర్వహించిన కార్యక్రమంలో శనివారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ , స్థానిక శాసన సభ్యులు వెడ్మ బొజ్జు లుకలిసి దివ్యాంగ లబ్ధిదారులకు ద్విచక్ర వాహనాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధితఅధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు స్వావలంబన కల్పించడంతో పాటు, వారి దైనందిన అవసరాలు, ఉపాధి అవకాశాలు, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ వాహనాలను అందజేశారు. లబ్ధిదారులకు వాహనాల తాళాలు అందిస్తూ, వారితో ఆత్మీయంగా మాట్లాడి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అన్ని విధాలుగా అండగా నిలిచి ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవించేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు అందుకున్న దివ్యాంగ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News