ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల మజారా గ్రామమైన కనకయ్యకొట్టాల లో నిన్న ఉదయం 11-గంటల 30 నిమిషాల సమయంలో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మేకల లింగస్వామి (14) ప్రమాదవశాత్తు కే.సి.కెనాల్ 114వ తూము వద్ద కాలకృత్యాలు చేసుకునే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మరణించడం జరిగింది. ఈ సంఘటన జరగడంతో తండ్రి మేకల శివలింగేశ్వరుడు, తల్లి మేకల మధులత ల చిన్న కుమారుడు లింగస్వామి మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లలు సెలవు దినాలలో, ఇతర దినాలలో వాగులు, వంకలు, నదులు, బావుల దగ్గరకు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోకూడదని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు ఇటువంటి సంఘటనలు జరగకుండా తమ పిల్లలను జాగ్రత్తగా తమ అదుపులో ఉంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
Admin
E Nivas News