ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి తట్టుపల్లి గ్రామంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న టియుడబ్యూజే (ఐజేయు) దాడులు నియంత్రణ కమిటీ జిల్లా కో-కన్వీనర్ బేతమల్ల సహదేవ్ ను పలువురు నాయకులు, పాత్రికేయులు పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, ఐజేయు మండల ఉపాధ్యక్షులు గండమాల రోషయ్య, ఐజేయు సీరోలు మండల ప్రధాన కార్యదర్శి మడ్డి వీరన్న గౌడ్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ లు ఆయనను కలిసి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. సహదేవ్ ఎల్లప్పుడూ పాత్రికేయుల హక్కుల పరిరక్షణ కోసం ముందుండి పోరాడే ధైర్యవంతుడని, ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి తన ఉద్యమ సేవలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.
Admin
E Nivas News