Thursday, 30 July 2026 01:16:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆయిల్ ఫాం సాగుతో రైతుల ఇంట సిరుల పంట

పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్

Date : 21 November 2025 11:58 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఆయిల్ ఫాం పంట సాగుతో రైతుల ఇంట సిరుల పంట పండుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఉద్యాన వన, వ్యవసాయ, సహకార శాఖ, సహకార సంఘం, తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆద్వర్యంలో శుక్రవారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో అవహగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రైతులు ముందుకు వచ్చి పంట మార్పిడి చేస్తేనే వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు సాధ్యమవుతాయని అన్నారు. ఆయిల్ ఫాం పంట వేసిన నాలుగేళ్ల నుంచి 30ఏళ్ళ వరకు పంట దిగుబడులు వస్తూనే ఉంటాయని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లు ఆయిల్ ఫాం పంట సాగుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ కల్తి నూనెల నుంచి మన ఆరోగ్యం కాపాడుకోవాలoటే ఆయిల్ ఫాం పంటలను సాగు చేయాలని అన్నారు. టీజీఈఆర్సి సలహాదారు శశిభూషణ్ కాచే మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫాం పంట సాగులో ప్రయత్న లోపం లేకుండా మంచి భూ యాజమాన్య పద్దతులు పాటించి పంట పండించుకొని దిగుబడులు పొందాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్రవేత్త భాస్కర్ రావు, ఉద్యాన వన అధికారి జ్యోతి, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.అనిల్ కుమార్, వ్యవసాయ అధికారి నవ్య, పంట సాగు పద్దతులను, వచ్చే దిగుబడులు, లాభాలు, మార్కెటింగ్ వివరాలు చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం లో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, ఊదరి శంకర్, బూడిద శంకర్, ఆరెల్లి కిరణ్ గౌడ్, బెజ్జంకి డిగంబర్, భూడిద గణేష్, దొరగోర్ల శ్రీనివాస్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: