ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏడుపాయల జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు అసౌకర్య కలవకుండా అన్నిజాగ్రత్తలుతీసుకోవాలన్నారు.ట్రాఫిక్, త్రాగునీరు, పార్కింగ్ పార్కింగ్, సంస్కృతిక కార్యక్రమాలు, దర్శన ఏర్పాట్లు , ఇతర పెండింగ్లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ప్రశాంతంగా ముగించాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News