ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పెద్దపెల్లి జిల్లాకాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ శివారులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం రైతు మహిళలతో కలిసి పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. రైతుల కష్టసుఖాలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ వ్యవసాయ పనుల్లో పాల్గొన్న ఎంపీ నాటు వేసినందుకు ఆనందభక్తం చేశారు. వరినాట్ల అనంతరం అక్కడే పనిచేస్తున్న మహిళా కార్మికులతో కలిసి ఎంపీ మధ్యాహ్న భోజనం చేశారు. నేలపైనే కూర్చొని సాధారణ భోజనం చేస్తూ రైతు కుటుంబాల జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులతో మమేకమై సాగునీటి సదుపాయాలు, పంట పెట్టుబడులు, కూలీల కొరత, ఉపాధి సమస్యలపై చర్చించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడమే నిజమైన ప్రజాప్రతినిధి ధర్మం. పొలంలో చెమట చిందిస్తేనే రైతు జీవితం అర్థమవుతుంది” అని ఎంపీ అన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయం అభివృద్ధి చెందేలా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News