Sunday, 13 September 2026 12:53:55 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్...

Date : 28 February 2026 10:13 PM Views : 219

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, యువత దూరదర్శిని, సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి మైదానం వైపు రావాలని మంత్రి వివేక్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ప్రతాపసింగారంలో ఏర్పాటు చేసిన స్పాట్‌లైట్ క్రికెట్ మైదానాన్ని రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి జీ. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతాపసింగారంలో అద్భుతమైన క్రికెట్ మైదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. గత 20 ఏళ్లుగా నర్సింహారెడ్డి క్రికెట్‌కు సేవలందిస్తున్నారని, ఆయన కుమారుడు రంజిత్ మంచి క్రీడాకారుడిగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. రిబ్బన్ కట్ చేసి మైదానాన్ని ప్రారంభించిన అనంతరం బెలూన్లను గాల్లోకి వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. దూరదర్శిని, సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి యువత మైదానం వైపు రావాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. అందరూ కలిసి ఆస్వాదించే ఆట క్రికెట్ అని, ఈ ఆటకు దేశవ్యాప్తంగా అపార ఆదరణ ఉందన్నారు. తాను హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నగర పరిసర ప్రాంతాల్లో క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నానని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇటీవల కాక వెంకటస్వామి గారి పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించిన విషయాన్నిగుర్తుచేశారు. క్రికెట్‌లో ప్రస్తుతం అనేక మార్పులు జరుగుతున్నాయని, అందుబాటులో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 15 శాతం కంటే ఎక్కువ క్రికెట్ ప్రవేశ పత్రాలు ఇవ్వరాదని ప్రస్తావించారు.తాను నివసించేమొయినాబాద్ ప్రాంతంలో కూడా క్రికెట్ మైదానం ఏర్పాటు చేశానని, అక్కడ యువత నుంచి మంచి స్పందనలభిస్తోందన్నారు. ఉస్మానియా వైద్య కళాశాల రోజుల్లో స్కూటర్‌పై వెళ్లి క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షకులు అందుబాటులోకి వస్తే మరింత ప్రతిభ వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. * ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన* మంత్రి ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను సందర్శించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను పరిశీలించి, వారు ప్రదర్శించిన నమూనాలు మరియు ప్రయోగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను అభినందిస్తూ విజ్ఞానంతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :