ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ : బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సంత (అంగడి) అవరణలో ఏర్పాటు చేయనున్న ముగ్గుల పోటీలను జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు.14 న (నేడు) కూరగాయల మార్కెట్ (సంత)లో ఉదయం 9 గంటల నుండి ముగ్గుల పోటీల నిర్వహిస్తామన్నారు. ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సాహక బహుమతులు అందుకోవాలని నవీన్ రావు కోరారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతులమీదుగా మొదటి బహుమతి 5,116/-,రెండవ బహుమతి 3,116/-, మూడవ బహుమతి 2,116/- అలాగే పోటీలో పాల్గొన్న ప్రతీ మహిళలకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరగునుందని తెలిపారు. ఆయన వెంట మాజీ ఓడీసీ ఎమ్మెస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు దిగజర్ల శ్రీనివాస్, పానుగొతు వెంకన్న, మాచర్ల భద్రయ్య, పరశురాములు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు,
Admin
E Nivas News