Tuesday, 28 July 2026 06:18:32 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

Date : 01 March 2026 08:05 AM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు చూడడంతో పాటు వంటశాల,విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం మెనూ ప్రవేశపెట్టి అమలు చేస్తుందని,విద్యారంగ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అందించే భోజనం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులను వినియోగించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతపైవిద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.10వ తరగతి వార్షిక పరీక్షల సమీపిస్తున్నందున విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని, సులభంగా జీర్ణమయ్యే ఆహారం అందించాలని తెలిపారు. పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు తయారుచేసిన మట్టి ఆకృతులను పరిశీలించారు. అనంతరం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని,నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఇంటి నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడంజరుగుతుందని, లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: