ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివ ర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థా పనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకలకు సీఎం హాజరవుతారు. అదే రోజున సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.కీలక అంశాలపై చర్చలు :19న ఉదయం అమ్మవార్ల నూత న ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. మేడారంలో నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా కేబినెట్ భేటీలో నిర్ణయంతీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపుకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు, తదితర అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Admin
E Nivas News