Monday, 14 September 2026 03:31:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 21 October 2025 07:46 PM Views : 335

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు, త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లేయోధులు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) ను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న రామగుండం పోలీస్ కమిషనర్ తో పాటు మంచిర్యాల జిల్లాల కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, ఆర్జి-1 జి ఎం లలిత్ కుమార్, ఏన్టీపీసీ , ఆర్.ఎఫ్ సి.ఎల్ అధికారులు ఏ.సి.పిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్.ఐ మల్లేశం సారధ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పోలీసు అమరవీరులత్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో అమరవీరుల కుటుంబ సభ్యులకు అందించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ పోలీస్ అండగా ఉంటుందని ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సంబందించిన ప్రభుత్వ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఎవో శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు సిపిఓ సిబ్బంది స్పెషల్ పార్టీ ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: