ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఫిబ్రవరి 3న మంచిర్యాల కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడా ఎంపిక పోటీలు బాలుర ప్రతపాఠశాలమైదానంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో మంచిర్యాల ఎం. జె.పి. డిగ్రీ ( బాలుర ) కళాశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఈనెల 7 వ తేదీన నిర్వహించబోతున్న జిల్లానియోజకవర్గస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ లో యు /20 విభాగంలో వివేక్ 100 మీటర్ల రన్నింగ్ లో ప్రథమ స్థానం, ప్రణయ్ 200 మీటర్ల లో ప్రథమ స్థానం, వెంకట్ ద్వితీయ స్థానం,అభిరామ్ కబడ్డీ లో ఎంపిక అదేవిధంగా దవడపల్లి జరిగిన క్రీడా పోటీల్లో కూడా అరుణ్ కుమార్ యు/20 విభాగంలో 1500 మీటర్లు, 3000 మీటర్ల లో ప్రథమ స్థానం, అమిత్ షార్ట్ పుట్ మరియు110 హార్డీల్స్ లో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దేవేందర్ తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థులను ఆదిలాబాద్ ఆర్ సి ఓ సేరు శ్రీధర్ కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.
Admin
E Nivas News