Friday, 11 September 2026 10:26:35 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Date : 24 August 2026 06:18 PM Views : 112

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో సీఎస్‌ఆర్‌ నిధులు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2011లో హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం అమలు అవుతోందన్నారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద 10 మైళ్ల పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలో కూడా అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన సూచనల మేరకు సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో మంథనిలో ఆధునిక యంత్రాలతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక్కడ గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని మంత్రి తెలిపారు. వారానికి కనీసం మూడు సార్లు విద్యార్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. పిల్లలకు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం కాకుండా వివిధ రకాల టిఫిన్లను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థిని గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరయ్యే పరిస్థితి ఉండేదని తన కష్టాలను మంత్రితో పంచుకుంది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత సాధించడంతో పాటు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదల పొందుతారని మంత్రి అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని కలెక్టర్ తెలిపారు. తాజాగా ప్రారంభించిన అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభిస్తోందన్నారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఫిన్‌లాండ్‌లో శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారని, భవిష్యత్తులో మరింత మంది ఉపాధ్యాయులు విదేశాల్లో శిక్షణ పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్ట పునాది వేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న,మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్.జీ.3 జీఎం, తహసిల్దార్ ఆరిపోద్దిన్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :