ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు విద్యతోపాటు క్రీడల రాణించినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ అన్నారు. శనివారం అంతర్జాతీయ క్రీడ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాలలో గత మూడు రోజులుగా నిర్వహించిన క్రీడల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ప్రిన్సిపల్ సిహెచ్ మంగ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి క్రీడల్లో మక్కువ చూపినట్లయితే పెద్ద పెరిగాక క్రీడల్లో కూడా ఆరితేరుతారని అప్పుడే మంచి మంచి అవకాశాలు కూడా సొంతమవుతాయని తెలిపారు. చదువుకు ఏ విధంగా ప్రాధాన్యతని ఇస్తారు క్రీడలకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వారి ముందు భవిష్యత్తులో ఎంతో దోహదపడతాయన్నారు. మేజర్ ధ్యాన్చంద్ సైతం క్రీడా రంగానికి ఎంతో ప్రాధాన్యత నిచ్చిన గొప్ప మహనీయుడు అన్నారు. ఇప్పటికీ అతడు కనుల ముందు లేకున్నా అతని ప్రతి సంవత్సరం గుర్తించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అనంతరం పలు క్రీడల్లో గెలిచిన క్రీడాకారులకు పథకాలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ, శ్రీపాల్, పిడి నాంపల్లి, పి.టి రాజేష్, డి డబ్ల్యు రమ్య లత ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News