Sunday, 13 September 2026 01:37:25 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 May 2026 11:34 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యంను కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని, ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . గురువారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల తహసిల్దార్లు పుష్పలత, దిలీప్ కుమార్ లతో కలిసి రాజరాజేశ్వర రైస్ మిల్ ను సందర్శించి ప్రక్రియ పరిశీలించిన అనంతరం గాయత్రి రైస్ మిల్ లో ఏర్పాటు చేసిన గోదామును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే వరి ధాన్యం తప్పనిసరిగా నిబంధనల ప్రకారం శుభ్రపరచి, నాణ్యత ప్రమాణాలు పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో లారీలు, హమాలీల కొరత, సమస్య లేకుండా ధాన్యం దిగుమతి త్వరగా పూర్తిచేసే విధంగా రైస్ మిల్లులు, లారీల యజమానులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అనంతరం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, గోదామును దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు, ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు రాకుండా, హమాలి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :