ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు కడుపునిండా తింటానే ఆరోగ్యం ఉంటే చదువుకుంటారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు సోమవారం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపలపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా రాందేని పెద్ద వెంకటేష్, నల్లపు ప్రవీన్ లో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని వారు అర్ధాలతో ఉంటారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అల్పార పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిన్న వెంకటేష్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమల రావు, జాకబ్ , కాంగ్రెస్ మంచిర్యాలనియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News