ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి విద్యా రంగానికి పెద్దపీట వేసిందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ (గుడిపేట) లోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, సమాజం పట్ల సేవాభావం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. విద్యార్థి మండలి ద్వారా పాఠశాలలో విద్యార్థులసమస్యలను తెలుసుకోవడం, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నూతన విద్యార్థి మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతోదోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Admin
E Nivas News