ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆపదలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారి ప్రాణాలను రక్షించడానికి సీఎం సహాయనిది ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. లక్షెట్టీపేటమున్సిపాలిటీ పరిధిలోని కె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో దండేపల్లి, లక్షెట్టీపేట మరియు లక్షెట్టీపేట మున్సిపాలిటీ చెందిన 117 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి విలువైన4607600 రూపాయల చెక్కులనులబ్ధిదారులకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోనే మన మంచిర్యాల నియోజకవర్గానికి 2911 సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్, మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్లా నాగభూషణం, పూర్ణచంద్ర రావు, దండేపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్,కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కో-ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News