Friday, 11 September 2026 10:14:13 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ చివరి వార్నింగ్..

Date : 25 August 2026 09:29 PM Views : 89

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం పేరిట సమరభేరి మోగించబోతోంది బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ పోరు బాట పట్టబోతోంది. అయితేఏదోతూతూ మంత్రంగా ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించి వదిలేయకుండా… వారం రోజులపాటు నిరసన ప్రర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది గులాబీ అధిష్టానం. సమరభేరి పేరిట పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, వారంపాటు షెడ్యూల్‌ వేయడం వెనక గట్టి కారణమే ఉండవచ్చని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికి జిల్లా, నియోజకవర్గాల లెవల్‌లో మాత్రం మమ అనిపిస్తున్నట్టు అధిష్టానం దగ్గర ఫీడ్‌బ్యాడ్‌ ఉందట. అందుకేఈసారి వారంపాటు చేయబోయే సమరభేరిని చేశామంటే చేశాం అన్నట్టు కాకుండా…సీరియస్‌గా జరపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలంటే దాంట్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కచ్చితంగా పాల్గొనాలని కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారట. అదే సమయంలో పార్టీ నేతలకు ఆయన సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లకపోయినా పెద్దగా పట్టించుకోలేదని, ఇక మీదట అలా ఉండబోదని కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై వారం రోజులపాటు సమరభేరి చేయాలని ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదని, ఇది భవిష్యత్‌ సంకేతమని అన్నట్టు చెప్పుకుంటున్నారు. వారం రోజుల కార్యక్రమాన్ని జిల్లా, మండల, గ్రామస్థాయిలో కూడా సక్సెస్ చేయాలని కేటీఆర్ గట్టిగా అన్నట్టు తెలిసింది. గతంలోని కార్యక్రమాల మాదిరిగానే దీన్ని కూడా లైట్ తీసుకుంటే వాళ్లను పార్టీ కూడా లైట్ తీసుకుంటుందని స్ట్రాంగ్‌గా హెచ్చరించినట్టు సమాచారం. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు పార్టీ కార్యక్రమాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారని, ఆ వైఖరి పార్టీకి నష్టం చేస్తోందని అన్నారట కేటీఆర్‌. ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉండటంతో ఇప్పట్నుంచే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని ముఖ్య నేతలకు చెప్పారట కేటీఆర్‌. సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయకుంటే అలాంటి వాళ్ళ విషయంలో కఠినమైన నిర్ణయాలు ఉంటాయని కూడా కేటీఆర్‌ కుండబద్దలు కొట్టారని చెబుతున్నారు. సమరభేరి కార్యక్రమం విజయవంతంకాని నియోజకవర్గాలను గుర్తించిఅక్కడి ఇన్చార్జ్‌లను మార్చే ప్రతిపాదన కూడా ఉందట.ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందేమోనని, ఏ నియోజకవర్గం ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పట్నుంచే ఖర్చు చేయడం ఎందుకని కొందరు దూరంగా ఉంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారట కేటీఆర్‌. ఏ కార్యక్రమమైనా రాష్ట్ర పార్టీ నుంచి ఖర్చు చేయాలంటే కష్టమని, లోకల్ గా ఉన్నవాళ్లు, గతంలో పదవులు అనుభవించిన వాళ్ళే అన్నీ చూసుకోవాలని పరోక్షంగా చెప్పినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నఇక ఎన్నికల టైం సమీపించేకొద్దీ వత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్‌ తీసుకోకూడదని గులాబీ అధిష్టానం భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :