ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈ నెల 20, 23న నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి 2వ ఎడిషన్ సీఎం కప్ లో బాగంగా ఖో ఖో లో రేచిని పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు ఎంరజిత ,కె.అక్షయ,ఎం హర్షిత, ఎం, శివాని , కొమ్ము వెంకటేష్, జి అంజి మంచిర్యాల జిల్లా జట్టు తరుపున రాష్ట్రస్థాయి పోటిలలో పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగేకావ్య గచ్చిబౌలిలో కిక్‌బాక్సింగ్ రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొంటుందన్నారు. రేచిని గ్రామ యువకులు లక్ష్మణ్,రామ్, హరీష్ మహేష్ హ్యాండ్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో మహేందర్ కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను వ్యాయమ ఉపాద్యయులు సంతోష్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
Admin
E Nivas News