ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది వందేమాతర గీతం అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ అన్నారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకగా నిర్వహించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో శుక్రవారం లక్షెట్టిపేట పట్టణం గాంధీ చౌక్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వివిధ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు మరియు ప్రజలతో కలిసి సామూహిక వందే మాతరం గీతాలాపన చేశారు. అనంతరం ఎర్రవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిని ఏకతాటిపై తీసుకువచ్చిన గీతం వందేమాతరం అన్నారు. బకీం చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిలోనూ పోరాటస్ఫూర్తిని రగిలించిందన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తలుచుకుంటున్నామని వారి త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్ రావు, మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్, సీనియర్ నాయకులు నరేష్ చంద్ జైన్ గుండ ప్రభాకర్ మాజీ జెడ్పిటిసి ముత్తె సత్తయ్య, రాజ గురువయ్య, కానుగంటి మల్లయ్య, పాంచాల రమేష్, రాజమౌళి భూత అధ్యక్షులు సీనియర్ నాయకులు వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News