ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలకు ఈ సీజన్ లో కూడా చుక్కెదురైంది. ఎరువుల, కూలీల కొరత లను అధిగమించి పంటలు సాగుచేస్తూన్న రైతులకు పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విలయతాండవం చేయడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. ఎకరాకు సుమారు రూ. 30 వేలు పెట్టుబడులు అయ్యాయని, తుఫాన్ ప్రభావంతో వారి పంట నేలకొరగడంతో పెట్టు బడులు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలనిమండలంలోని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
Admin
E Nivas News