Monday, 14 September 2026 08:59:55 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

స్వీపింగ్ కార్మికుల నిరసన

మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

Date : 05 June 2026 05:20 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ఆర్టీసీలో పని చేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల ఆర్టీసి డీఎం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంథని బస్టాండ్ గేటు ముందు స్వీపింగ్ కార్మికులు చిప్ప చేత పట్టుకొని ధర్నా నిర్వహించి ప్రయాణికుల నుండి భిక్షాటన చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల వివక్షత చూపుతూ డీఎం నియంతల వ్యవరిస్తున్నాడని అన్నారు. కార్మికులను ఇష్టాను రీతిలో తొలగిస్తూ ఇష్టాను రీతిలో తీసుకుంటున్నాడని విమర్శించారు. అంత్య పుష్కరాల సందర్భంగా ఒక కార్మికురాలును విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు చేయించుకొని పుష్కరాలు పూర్తికాగానే విధుల నుండి తొలగించారన్నారు. కార్మికులను ఎందుకు తొలగించారని అడిగితే డిఎం, కాంట్రాక్టర్ ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకొని కార్మికుల మధ్యన చిచ్చురేపి కార్మికుల గొడవలకు కారణమవుతున్నారని విమర్శించారు. దళిత మహిళా కార్మికులు తమ గోడు వెళ్ళబుచుకుందామని డిఎం వద్దకు వెళితే కనీసం కలవనీయకుండా తమ సిబ్బందితో దళిత మహిళా కార్మికులను గేటు బయటకు గెంటేశాడని ఆరోపించారు. బస్టాండ్ అభివృద్ధి పేరిట లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అదే బస్టాండ్ లో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోలో జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన విచారణ జరిపి ఆర్టీసీ డిఎం పై చర్యలు తీసుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్పుల సురేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్యలు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: