Tuesday, 28 July 2026 11:13:52 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

వడదెబ్బతో మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికునికి ఘనంగా నివాళులు...

Date : 20 May 2026 10:36 PM Views : 124

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేట గ్రామ పంచాయతీకి చెందిన తాళ్లపల్లి లక్ష్మయ్య వడదెబ్బకు మృతి చెందడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంకట్రావు పేట గ్రామపంచాయతీలో గత 31 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న తాళ్లపల్లి లచ్చయ్య మూడు రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య గ్రామపంచాయతీకి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని లచ్చయ్య ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ పలకవర్గం సభ్యులు ఆయన కుటుంబానికి విరాళాలు అందజేశారు. గ్రామపంచాయతీ నుంచి లచ్చయ్య కుటుంబానికి 10,000, సర్పంచ్ నలిమెల రాజు వ్యక్తిగతంగా 5000, పాలకవర్గ సభ్యులు మీసా శ్రీనివాస్ 2000, బోడ కుంటి మారుతి 2000, దాసరి ఏసు మని1000, అంకతి వెంకటేష్ 1000, బెడగం రామయ్య 1000, తోట దివ్యసాగర్ 1000 వీఆర్ఏ కన్లే విజయ 500, పంచాయతీ కార్యదర్శి వంశి కృష్ణ 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు మానవత్వాన్ని చాటుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :